పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-4 పాడి. సంపుటం; 07-504

పల్లవి:
సిగ్గులు పడకువయ్య చెక్కుచెయి దీయవయ్యా
నిగ్గుల నవ్వితిమి నీజాడలెరఁగక

చ.1:
వేడుకకాఁడవు నీవు వెలఁదులఁ గంటేను
కూడుకవత్తువుగాని కొట్లాడవు
వోడవేపనికినైనా వోపికగలవాఁడవు
ఆడుకొంటిమిందాఁక నీ ఆయాలెరఁగక

చ.2:
పాయపువాఁడవు నీవు పడఁతులేమి చేసిన
చాయల మెత్తువుగాని చలపోరవు
యీయకొందువేమైనా నింటివాఁడవందరికి
చేయివట్టి తీసితిమి చిత్తమి దెరఁగక

చ.3:
చెల్లుబడివాఁడవు శ్రీ వెంకటేశ యింతుల
పల్లదాలకు లోఁగాని పాయవెన్నఁడు
యిల్లీదె మమ్మేలితివి యిన్నిట దయానిధివి
వల్లెవేసితిమి నీవరుస లెరఁగక