పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0101-4 సామంతం సంపుటం: 07-004

పల్లవి:
నీవెఱితనమెంతునో నిన్నుఁ బుత్తెంచినట్టి
ఆవెఱితనమెంతునో అమ్మరో నేఁడు

చ.1:
అక్క విలిచీనంటా నాతఁడూ కొలువుండఁగా
ఇక్కడఁ బిలువ వచ్చేవింత యేఁటికే
చిక్కించుక యింటిలోనే చెల్లినట్లు శేసుఁగాక
తక్కి మీయేలికసాని తగవేఁటి తగవే

చ.2:
అప్పటిఁ బోదువుగాని అందాఁకా విచ్చేయుమంటా
దుప్పటి కొంగు వట్టేవు దొడ్డదానవే
చెప్పి తన వూడిగెపు చెలిచే నింత సేయించె
తప్పని మీయాపె దొరతనమేఁటితనమే

చ.3:
ఆసలు చూపి మాటాడి ఆనవెట్టి సన్నసేసి
బేసబెళల్లితనమునఁ బెనఁగేవపునే
యీసుల శ్రీ వేంకటేశు నింత సేయించి తాఁగూడె
వాసితో మీదొరసాని వరుసేఁటి వరుసే