పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0184-2 శంకరాభరణం సంపుటం: 07-496

పల్లవి:
సందడెంతైనాఁ గలదు సతులలో నీకు
అందరిలోఁ గరుణించి ఆదరింతుగాని

చ.1:
మోము చూచి నీకు నేను మొక్కితిఁ జుమ్మీ రమణ
ఆముకొని యాడో పరాకైైతిననక
వోముక నీ చేఁతలు నావొళ్ళిపై నున్నవి సుమ్మీ
చేముట్టి తడివిచూచి చిత్తగింతుగాని

చ.2:
గక్కనఁ గైదండయిచ్చి కదిసి వుండితిఁ జుమ్మీ
చిక్కి ఆ వేళను మరచితి ననక
మక్కువ నాతోనాడిన మాటపట్టున్నది సుమ్మీ
పక్కన నాపాలఁజిక్కి పాయకుందుగాని

చ.3:
ననుప్తున నీతో నేను నవ్వులు నవ్వితిఁ జుమ్మీ
చెనకనేరక భ్రమసితిననక
మొనసి శ్రీ వెంకటేశ ముంచి కూడితివి సుమ్మీ
పెనచి నీమహిమెల్లా బెరయింతుగాని