పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0184-1 నాదరామక్రియ సంపుటం: 07-495

పల్లవి:
చిత్తగించు మామాఁట శ్రీ నరసింహా
చిత్తజ జనక వో శ్రీ నరసింహా

చ.1:
చెలరేఁగి వున్నాఁడవు శ్రీ నరసింహా - నీకు
జెలులెల్లా మొక్కేరు శ్రీ నరసింహా
సెలవుల నవ్వేవిట్టే శ్రీ నరసింహా- నీకే
సెలవు మావలపులు శ్రీ నరసింహా

చ.2:
చిందీని మైఁజెమటలు శ్రీ నరసింహాఁ నిన్ను
జెందినది కడు జాణ శ్రీ నరసింహా
చెందమ్మి రేకుల గోళ్ళ శ్రీ నరసింహా- నీపై
చిందులెల్లా బాడేము శ్రీ నరసింహా

చ.3:
సిరినెరకాఁగిటి శ్రీ నరసింహా- మంచి
సిరుల నహోబలము శ్రీ నరసింహా
శిరసెత్తు శ్రీవెంకట శ్రీ నరసింహా
చెరలాటాలిఁకనేల శ్రీనరసింహా