పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0183-5 శ్రీరాగం సంపుటం; 07-493

పల్లవి:
మదనుని తండ్రికి మజ్జనవేళ
పాదిగొనీ సింగారపు భోగములెల్లాను

చ.1:
పడఁతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు
కడలేక పాగడొందెఁ గప్పురకాపు
నిడివిఁ గల్బ వృక్షము నిండాఁ బూచినట్టు
కడుఁ దెల్లనై యమరెఁ గప్పురకాపు

చ.2:
సుదతుల చూపులు సారిది పైఁగప్పినట్టు
పొదిగొని జొబ్బిలీని పుణుఁగుకాపు
అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు
పాదలెఁ దిరుమేనను పుణుఁగుకాపు

చ.3:
అలమేలుమంగ వురమందుండి యనురాగము
కులికినట్టు పన్నీరుఁ గుంకుమకాపు
యెలమి శ్రీ వెంకటేశుఁడిన్ని సొమ్ములు నించుక
కొలువెల్లా నిండుకొని కుంకుమకాపు