పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0183-4 సాళంగనాట సంపుటం: 07-492

పల్లవి:
ఎందాఁక వేసరించే నిదివో నిన్ను
పొందితే నీ కాఁగిటిలో పాఁగేదేకాక

చ.1:
చిగురుఁ గొమ్మకు నెంత చేగలెక్కినామేలే
మగువనెంత వెంచినా మాకుమేలే
జగడాలకేమి వని సాదువలెనుండి నీవు
మొగము చూచినంతలో మొక్కేదే కాక

చ.2:
వలరాజునమ్ముకెంత వాఁడివెట్టినామేలే
చెలిని నీవెంత సింగారించినామేెలే
చలపోర మరియేల చనవుకొలఁదినే
పిలిచినప్పుడే నీతోఁ బెనగేదే కాక

చ.3:
బంగారు ప్రతిమ కెంత ప్రాణము వోసినామేలే
అంగనకెంత లోనైనా మేలే
సంగతి శ్రీ వెంకటేశ సరి నన్నుఁ గూడితివి
పొంగి నీవు చెనకితే భోగించుటే కాక