పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0183-1 రామక్రియ సంపుటం: 07-489

పల్లవి:
కొచ్చి కొచ్చి కొసరీనే గొల్లకొసరు
కుచ్చి యెత్తెవే చన్నుల గొల్లకొసరు

చ.1:
చేరువనుండి నిన్నుఁ జెనకీనదివో వాఁడు
గోరికొనలనొత్తవే గొల్లకొసరు
మారుకొని నీతోనిట్టి మాఁటలాడ వచ్చీని
కూరిమిఁ దిట్టఁగదవే గొల్లకొసరు

చ.2:
పఱచుఁజేఁతలు చేసి ఫైకొనీ వచ్చి వాఁడు
గుఱుతు మోవిసేయవే గొల్లకొసరు
మెఱసి పెనఁగవచ్చీ మిక్కుటపురతులను
కొఱకొఱఁ బెట్టఁగదే గొల్లకొసరు

చ.3:
చెల్లుబడి వావిచెప్పి శ్రీవెంకటేశుఁడు గూడె
కొల్లున నవ్వఁగదవే గొల్లకొసరు
బల్లీదుఁడాతఁడు నీవు పట్టపు దేవులవై
కొల్లలాడేవే వలపు గొల్ల కొసరు