పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0182-5 రామక్రియ సంపుటం; 07-487

పల్లవి:
ఇన్నిటా సరసుఁడవు యెంతసేసేవు
వెన్నెల పులుగములా వేడుక నీసిగ్గులు

చ.1:
మలసి యాలకొంకేవు మరికొంత నవ్వరాదా
వెలవెట్టి కొంటివా యీవీటనేమైనా
అలరి మాఁటాడుమంటే అందునిందుఁ గలపేవు
కలగూరా యేమైనా గజిబిజి సేయను

చ.2:
మరులేని కొలిపేవు మనసు నాకియ్యరాదా
అరివేనఁ దెచ్చితివా అప్పుడే నీవు
తెరలోన దాఁగేవు తేరి నిన్నుఁ జూచితేను
సరిబేశా నీ చేఁతలు సారెసారె ముయ్యను

చ.3:
కొద్దినేల లోభించేవు కూరిమి పైజుల్లరాదా
మద్దులెక్కి కోసితివా మరియలసి
గద్దరి శ్రీ వెంకటేశ కలసితి విటు నన్ను
చద్ది మూటలా రతులు సారెకు భోగించను