పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0182-4 సామంతం సంపుటం: 07-486

పల్లవి:
ఇందుకే మెచ్చేరు చూచి యింతులెల్ల నిన్నును
విందుల నీ సొబగుకే వెలలేదుగాక

చ.1:
పన్నిన కొలువులోని పతిమెలెందరు లేరు
నిన్ను మోహింపించినదే నెలఁతగాక
యెన్నిలేవు కళలు నీకివె చెక్కుల మీఁదట
చిన్నికొనగోరురేకే చెప్పరాదుగాక

చ.2:
చప్పని వుప్పని మాఁటసరసములెన్ని లేవు
కొప్పువట్టి తీసినదే కొత్తలుగాక
ముప్పిరి మోవి మీఁదటి మొగచాటులెన్ని లేవు
కప్పి తములమిడుటే కతలాయఁగాక

చ.3:
సిగ్గువడ్డ చిత్తములో చిందువందులెన్ని లేవు
దగ్గరికూడినదే తగులుగాక
అగ్గమై శ్రీ వెంకటేశ ఆస లాసలెన్ని లేవు
నిగ్గుల యీకూటములే నేరుపులుగాక