పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0182-3 భైరవి సంపుటం: 07-485

పల్లవి:
పైఁడికతవంటిదాయ పైకొన్ననీతోడిమేలు
వేఁడి వేఁడి కోరికలు వెల్లవిరులౌను

చ.1:
తిలకించి చూడఁబోతే ద్రిష్టి దాఁకీనందువు
పలికితేనే బహుభాషిదందువు
చెలరేఁగి నవ్వితేనే సిగ్గులేనిదందువు
యెలమి నీతోడిపొాందు యెందుకైనా వచ్చును

చ.2:
సరసములాడితేనే చలివాసెనందువు
కరఁగితినంటే బూటకములందువు
సారిది నీకు మొక్కితే జూటరినేనందువు
యిరవై నీతోడిపాందు యెందుకైన వచ్చును

చ.3:
పైపైఁ జెయివేసీతే పంతమిచ్చెనందువు
రాపుగ మెచ్చితే బీరములందువు
బాపురా శ్రీవెంకటేశ బలిమిఁ గూడితి నన్ను
యేపున నీతోడిపొందు యెందుకైనా వచ్చును