పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0182-2 బౌళిరామక్రియ సంపుటం: 07-484

పల్లవి:
నేరుపరివౌదువే నీవిన్నిటా- వోరి
నేరకుంటే నేఁడుమమ్ము నీవింత సేతువా

చ.1:
పూని మాఁటలాడఁగదే పాలఁతీ -వోరి
వాన పలుమారువైతే వరదలౌరా
నానితేఁ గొంత వలపు నయమౌఁగదే-వోరి
నానునా గొడ్డలివంటి నాలైన నీచిత్తము

చ.2:
కలయవే మాపాత్తు కలికీ -వోరి
కలగలపు గిజ్జడి గాదటరా
పలురతులేకాదా పరిణామముఁ-వోరి
పలువంచలఁ బడెను పాయపు నీదేహము

చ.3:
సేస వెట్టితిగదే శ్రీసతీ-వోరి
సేసుకుంటే పుణ్యములు చేరకుండునా
రాసులైతే మేలే నీ రచనలెల్లా -వోరి
ఆసలు శ్రీ వెంకటేశ ఆయములు సోఁకెరా