పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0182-11 ముఖారి సంపుటం: 07-483

పల్లవి:
నేమే దొరసానులము నేరక లోననుందుము
సాముసేయ నెంతలేదు సముకపువారికి

చ.1:
సిగ్గువడ నెంతలేదు చెయిచాఁచ నెంతలేదు
దగ్గరి సేవలు సేసే తరుణులకు
వొగ్గి పిల్వ నెంతలేదు వోపనన నెంతలేదు
అగ్గలమై కాచుక అండనుండేవారికి

చ.2:
అందిపాంద నెంతలేదు ఆనవెట్టు నెంతలేదు
కందువనుండేటి వూడిగపువారికి
చెందికూడ నెంతలేదు చెల్లించుకో నెంతలేదు
యెందుకైనానొడిగట్టే యింటిలోనివారికి

చ.3:
రవ్వసేయ నెంతలేదు రచ్చకెక్క నెంతలేదు
నవ్వులు నవ్వించే మన్ననవారికి
జవ్వనపు శ్రీ వెంకటేశ్వరుఁడిదె నన్నుఁ గూడె
నివ్వటిల్ల నెంతలేదు నీవంటివారికి