పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0181-5 హిజ్జిజ్జి సంపుటం: 07-481

పల్లవి:
తానేకల గనెనో తప్పక చెప్పుమనవే
మానక తెల్లవారఁగా మాయింటికి వచ్చెను

చ.1:
ఆకు మడిచిత్తునంటా ఆయములూనంటెనంటా
కైకొని యిద్దరూనుండఁగల గంటినే
దాకొని నవ్వితినంటా తములమువెట్టినంటా
కాకరితనాల మంచి కల గంటినే

చ.2:
పెనఁగితి నేనంటా ప్రియము తాఁజెప్పెనంటా
కనుమూసినంతలోనే కల గంటినే
కొనగోరంటితినంటా కొప్పువట్టి తీసెనంటా
ఘనమైన వలపుల కల గంటినే

చ.3:
లలి సన్నసేతునంటా లాగుగాఁ జేపట్టునంటా
కలికితనాలనొక్క కల గంటినే
అలమేల్‌మంగనేను అట్టె శ్రీ వెంకటేశుఁ
గలసితినిట్లా నేకల గంటినే