పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0181-3 పాడి సంపుటం; 07-479

పల్లవి:
ఆతఁడెంత నీవెంత అవునే మేలు
యేతరిదానవు నీకునెంచనున్నదా

చ.1:
చెల్లుబడిగలితేను శింగారించుకొందుగాక
పల్లదాలాడుదురా పతితోను
గొల్లవారి తోడిపని గొడ్డలి నానఁబెట్టుట
మల్లాడి బుద్లిచెప్పితే మంకు మానీనా

చ.2:
మేనదానవై తేను మేరతోఁ గైకొందుగాక
ఆనలువెట్టుదురా ఆతనితోను
పూని చల్లలమ్మేవారిపాందు దూలమూఁతకోల
ఆనుకెంత కిందుపడ్డా నారడి మానీనా

చ.3:
చనవరివైవుండితే సరసమాడుదుగాక
యెనసి శ్రీ వెంకటేశునెగ్గులెంతురా
గునిసి మందలవారిగుణము రాతిపైనార
ననుపెంత గలిగినా నాలి మానీనా