పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0181-2 సామంతం సంపుటం: 07-478

పల్లవి:
ఊరకుండితే మేలు వూఁకొంటేఁ బైఁడికతౌను
బారపెట్టితే నలపు పచ్చిదేరెనందువు

చ.1:
పగడవాతెర విచ్చి పలుమారు మాఁటాడితే
దగర యెంతటిది రట్టడియందువు
మొగమెత్తి నేను నీమోము సారెకుఁ జూచితే
జిగిమించ నిదియెంత సిగ్గులేనిదందువు

చ.2:
చెలఁగి నీ చిత్తము రా సెలవుల నగితేను
కెలసి యెంత యెగసక్కెపుదందువు
తలఁపించి నీబాసలు తడవి పేరుకొంటేను
వలవంతనిది యెంతవళకులదందువు

చ.3:
గక్కన నేనే ముందు కాఁగలించుకొంటేను
దక్కి నీకంటె బలిమిదాననందువు
ఎక్కువ శ్రీవెంకటేశ యింతలో నన్నేలితివి
మిక్కిలినిఁ బెనఁగితే మీరితి నేనందువు