పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0181-1 సాళంగనాట సంపుటం: 07-477

పల్లవి:
ఆస తికి నీకుఁబోదు అండనుండేవారమింతే
బేసబెల్లితనమునఁ బెనఁగ మాకేల

చ.1:
కురులెంత చిక్కువడ్డాఁ గొనగోళ్ళే తీర్చు
సరులెంత పెనగొన్నా చన్నులే యాను
తరుణెంత గోపించినాఁ దగ నీవే వోర్చేవు
పెరరేఁచి సారెసారెఁ బెనఁగ మాకేల

చ.2:
పిక్కటిల్లుఁదిట్టులెల్లా పెదవి మోవఁగవలె
వెక్కసపుఁ గన్నులైతే విడిది మోమే
నిక్కముగ చెలి పంతము నీవే చెల్లించవలె
పెక్కువిధముల మీతోఁ బెనఁగ మాకేల

చ.3:
కందువ రతులకెల్లా కాఁగిలి యొక్కటే గురి
అందపుఁబిరుదు భారమానుఁ బాదాలు
యిందునె శ్రీ వెంకటేశ యీపె నీవురమెక్కెను
పెందలకాడనుండి పెనఁగ మాకేల