పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0180-6 సాళంగనాట సంపుటం: 07-476

పల్లవి:
నిజము నిష్టూరము నేమైతేను
గుజగుజలను యాల కొసరింపించేవు

చ.1:
నెమ్మినాపెను వేఁడుకో నీవే నేరుతువు
కొమ్మ కోపము దప్పించుకో నేరుతువు
దొమ్మరి చేఁతలు సేసి తిద్దుకొననే రుతువు
మమ్మేల యందుకునెడమాఁటలాడించేవు

చ.2:
పొసంగ నీయంకెకు రాబుద్ధిచెప్ప నేరుతువు
అసు దైయాపెపంపుశాయఁగ నేర్తువు
పసలుగా సారెసారె బాసలు సేయనేర్తువు
యెసగి నే వెంటవచ్చియేమి సేసేనయ్యా

చ.3:
ఈవులిచ్చి యింటికిరా నెలయించ నేరుతువు
వేవేలు విధముల నవ్వించ నేర్తువు
శ్రీ వెంకటేశుఁడ నీవే చెలియఁగూడితి విట్టే
దేవుఁడవు మమ్మెంత పొదిగి మెచ్చేవిపుడు