పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0180-5 కేదారగౌళ సంపుటం: 07-475

పల్లవి:
వట్టియలుకల నీవే వలఁబడితివి గాక
పట్ల పెనఁగఁగా నీతోఁ బదరితినా

చ.1:
అడరి నే వద్దకి రానంటాఁ గోపగించేవు
వొడివట్టి తియ్యఁగా నే నోపనంటినా
పడితిఁ గాఁకలనంటాఁ బలుమారు దూరేవు
కడఁగి కాఁగిలించఁగాఁ గాదంటినా

చ.2:
కతలనే తెల్లవారెఁగా యంటాఁ గినిసేవు
రతిఁబిలువఁగా నే రానంటినా
తతి మోవి తేనెకుఁగా దవ్వులఁబొరలే విట్టే
ఇతవై నీవడుఁగఁగా నియ్యనంటినా

చ.3:
అంచల నేకతమాడనంటాను మొరసీవు
వంచి తెరవేయఁగా నేవద్దంటినా
పొంచి శ్రీ వెంకటేశ యిప్పుడు నన్నుఁబొందితివి
మంచముపై నల్లపుడు మారుకొంటినా