పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0180-4 మధ్యమావతి సంపుటం: 07-474

పల్లవి:
తెట్టఁదెరువుననేల తేరకాఁడా
యెట్టువలసిననయ్యీ నింటికి రావయ్యా

చ.1:
గొల్లెతల నీవేల కొప్పువట్టి తీసేవు
చల్లచాడె వదిలము జాజరకాడ
గుల్లసంకుదుబ్బను కొలచి పోయిమనేవు
యిల్లిదె యిప్పుడె మాయింటికి రావయ్యా

చ.2:
వుమురుఁగూటాన నావొడివట్టి పెనఁగేవు
చమురు చిందీనోయి జగడగాఁడ
బమసి పిల్లఁగోవి పడిరోఁ బోయిమనేవు
యిముడుకోవలసితే యింటికి రావయ్యా

చ.3:
బాలుఁడ శ్రీవెంకటేశ పయ్యదేల తొడికేవు
పాలు దొలఁకీనోయి పంతగాఁడ
కోలుముందై నీతుత్తురుఁగొమ్ములోఁబొయుమనేవు
యేలుకొందుగాని మాయింటికి రావయ్యా