పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0180-3 మలహరిసంపుటం: 07-473

పల్లవి:
తిరు మజ్జనపు వేళ దేవునికి నిదివో
పరగ నారదాదులు పాడరో యిందరును

చ.1:
చింతదీర వేంచేసి సింహసనమున నుండి
దంతధావనాది కృత్యములు చేసి
సంతసాననంటరొ సంపెంగ నూనియదెచ్చి
కాంతలు గందపుటటికలి వెట్టురో

చ.2:
పంచామృతముల తోడ పన్నీట మజ్జనమాడె
కాంచనాంబరాలు గట్ట కస్తూరిపూసె
నించుకొనె సొమ్ములెల్లా నిలువు దండలు చాతె
పొంచి దూపదీపతాంబూలములొసఁగరో

చ.3:
పాదుకలు వాహనాలు బహుఛత్రచామరాలు
ఆదరించె శంఖకాహళాదివాద్యాలు
వేదపారాయణలతో వెసఁజూవెఁ గపిలను
గాదెలలెక్కలడిగె గడేరాలు వినెను

చ.4:
అంగరంగవైభవాలకరళుపాడులు వెట్టె
అంగపు నిత దానాదులన్నియుఁజెసె
చెంగటనలమేల్మంగ శ్రీ వెంకటేశుఁడు గూడి
ముంగిటిపారుపత్యములు చేసీని