పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0179-5 రామక్రియ సంపుటం: 07-469

పల్లవి:
అప్పుడుట నీవు నవ్వితివౌనోకాదో
చొప్పులు సోరణగండ్లఁ జూచితినావేళను

చ.1:
వనిత చన్నుల మీఁది వాసన కస్తూరి పూఁత
మునుప నీవురముపై ముద్రలంటెను
వెనకనొక్కతె వచ్చి వెఁస గాఁగిలించుకొంటే
తన చన్నుల నంటితే తాఁదెలిసి తిట్టెను

చ.2:
తరుణివుపరిసురతపువేళ మెడదండ
గిరికొని నీమెడఁ దగిలియుండఁగగా
తరువాత వేరొకతె తా నీరతికి కిందై
మరలి దండ దగుల మరి నిన్నుంఁ దిట్టెను

చ.3:
అలమేలుమంగ చెమటట్టే నీమేనిపైఁ జింది
చెలఁగి శ్రీ వెంకటేశ చిప్పిలుండఁగా
కలసి తులసీదేవి కాఁగిలించి ఆనీట
మెలుపునఁ దొప్పఁదోఁగి మెచ్చిమెచ్చి తిట్టెను