పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0108-4 భైరవి సంపుటం: 07-046

పల్లవి:
ఇందరి సాకి వెట్లేవిందుకే నీవు
అందిన చెలులతోడ నాడుకోరాదా

చ.1:
కోపగించి నిన్నునింత కొసరఁగరాదు గాక
మోపుగట్టి వొక్కచేత మొక్కరాదా
తీపుల పెదవి వంచి తిట్టరాదు గాక నిన్ను
చూపులఁ దప్పకయైనాఁ జూడరాదా

చ.2:
వాసీకెక్కించి నీతో వాదులెల్లా మానెఁగాక
వూసగుచ్చి నీగుణాలు పాగడరాదా
వేసరించి నీగుట్టు వెళ్ళవేయరాదు గాక
వేసాలకు నిన్ను నేదీవించరాదా

చ.3:
నీవు గాఁగలించఁగాను నిన్నేమనరాదు గాక
నావలపు చూచి నన్ను నవ్వుకోరాదా
శ్రీ వేంకటేశ యిట్టె చేరి కూడితివి నేఁడు
తావుల నాకొనగోరు తాఁకించరాదా