పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0179-3 ఆహిరి సంపుటం: 07-467

పల్లవి:
ఎప్పుడు తనదాననే యెగ్గువట్టేనా
చొప్పుగ నావంక దయఁజూచితేనే చాలదా

చ.1:
తానేల వేఁడుకొనీనే తడిసీఁ జెమటచేయి
అని విరహన గిజ్జిడైవుందానను
మానక సరిసేసుక మాఁటలేలాడీ నాతో
వీనులకు వెట్టదోఁచు విభుఁడు తాఁదాను

చ.2:
దగ్గరేల కూచుండీనే తనమేను కసుగందీ
వెగ్గళపు కాఁకలచే వేఁడై వుందాన
బగ్గన నాకేల తాను పచ్చడము గప్పితేనె
వగ్గి జీడివంటివలపు వొమ్మునో వొమ్మదో

చ.3:
అంతేల కాఁగిలించీనే ఆయములు తన్ను సోఁకీ
కంతునియమ్ములు మేనెల్లా కాఁడివుందాన
ఇంతలో శ్రీ వెంకటేశుఁడెనసీఁ దమకమేలే
వింత మోవి తేనె లెల్ల విందులాయ తనకు