పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0179-2 కన్నడగౌళ సంపుటం: 07-466

పల్లవి:
ఆతనిఁ గోసరకురే అందేమున్నది
ఆతుమలో సరివచ్చెనందేమున్నది

చ.1:
చాయపాటుమాఁటలెల్ల చవిసేసుకొంటగాక
ఆయడఁ దప్పువట్టితే అందేమున్నది
శేయరానిచేఁత చూచి సెలవి నవ్వుటగాక
ఆయరత దిద్దంబోతే అందేమున్నది

చ.2:
ఒలిసి నొల్లని వలపొడిఁ బెట్టుకొంటగాక
అలిగి సాలయఁబోతే అందెమున్నది
బలిమి చుట్టరికము పైఁబొదుగుటగాక
అలరి విచ్చి చూచితే నందేమున్నది

చ.3:
ఎగసక్కేలేమి గల్లా యెదఁబెట్టుకొంటగాక
అగడు శాయఁబోతే నందేమున్నది
నిగిడి శ్రీ వెంకటాద్రి నిలయుఁడే నన్నుఁగూడె
అగపడ్డ మీఁద నేరాలందేమున్నది