పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0179-1 కేదారగౌళ సంపుటం: 07-465

పల్లవి:
అడుగరే యీామాఁట అన్నియు. జెప్పేఁగాని
తడఁబాటు నవ్వులకు తానోపఁగలఁడా

చ.1:
ఇప్పుడు తనవొద్దికి యేల రమ్మనీనే
అప్పటిమాటలే కావా ఆడేవి
నెప్పున మాతోడిపొందు నిజము నిష్టూరమింతే
తప్పులు నేఁబట్టితేను తానోపఁగలఁడా

చ.2:
పీఁట మీఁద నుండి వచ్చి పెనఁగనేఁటికే నాతో
నాఁటి బాసలే కావా నడుపేవి
పాటించ మా విన్నపాలు పట్టినదే పంతమింతే
దాఁటరానినడకకు తానోపఁగలఁడా

చ.3:
ఆస మీరఁ దెరవేసి అంతలోనె నన్నుఁగూడె
చేసిన చేఁతలే కావా చెల్లేది
రాసికెక్క శ్రీ వెంకట రమణుఁడే తాఁగలఁడు
తాసువలె సరిదూఁగ తానోపఁగలఁడా