పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0178-6 పాడి సంపుటం: 07-464

పల్లవి:
చూతువు విచ్చేయవయ్య సారిది విరహమిది
చేత నీకు విన్నపము సేసేయట్లే వున్నది

చ.1:
చెక్కునఁ బెట్టిన చెయి చేరఁడేసి కన్నులకు
యిక్కువ చెప్పినయట్టు యింతికున్నది
మిక్కిలి కస్తూరిపట్టు మించు మోవి చంద్రునికి
దిక్కుల విహరించే రాతిరివలెనున్నది

చ.2:
పూవులపానుపు మీఁదఁ బొరలేటి చెలిబాగు
వావి నీకుఁబెట్టే సేసవలెనున్నది
యీవల తుమ్మిద కురులిట్టే చెదరివుండఁగ
వేవేలకు మరుదండు విడిదలై యున్నది

చ.3:
కడు దాపమునకుఁగా గందము పూసినపూఁత
వడి వలపుల వెళ్లి వలెనున్నది
యెడయక శ్రీ వెంకటేశయీకెఁ గూడితివి
నడుకొత్తి నిచ్చకల్యాణమువలెనున్నది