పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0178-4 శంకరాభరణం సంపుటం: 07-462

పల్లవి:
ఎంత రట్టుడియిది యిట్టి నేమపువానిని
ఇంతసేసెఁ జూడరమ్మ యిఁకనేమి సేసీనో

చ.1:
పిలిచి తా రాకుండఁగాఁ బ్రియునితోఁ బగచాటి
నెల పొడపు వెన్నెల నిద్రించేవాని
చెలీఁ దాను మంచముపైఁ జేరి యింటికిఁ గొంపోయి
మెలుత గాఁగలించితే మేలుకొనెనతఁడు

చ.2:
పందెమంటానంతలో పగడసాలాడె విభుఁడు
దిందుపడి మచ్చరానఁ దెల్లవారెను
ముందుయెడకె వచ్చె మొకమజ్ఞనానకు
కందువగానాపె వచ్చి గూడె వెట్టెనే

చ.3:
శ్రీ వెంకటేశుఁడందుకుఁ జేరి తనవురముపై
దేవులుఁ జూపతే తెలిసి మొక్కె
కావించి వారిద్దరును కైకొని మన్నించఁగాను
చేవదేర నూటిగాలు సేసి తా వెలసెనే