పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0178-1 దేసాళం సంపుటం: 07-459

పల్లవి:
చద్దికి వేఁడి వలపు సరికి బేసి
ఇద్దరూను యిద్దరమే యేలయింత గర్వము

చ.1:
సలీగెలఁ బొరలే నేసరితలు చూచేఁగాక
నెలఁతరో నీయంత నేరనా నేను
ఎలమితో రమణుఁడు యిద్లరినడిమితాసు
యిలపై యెందు వీఁగునో యేలయింత గర్వము

చ.2:
ఆసోదపు నీలోని అనువు దెలిసేఁగాక
వోసతిరో నీపాటి వోపనా నేను
పూసలలో దారమీపురుషుఁడు నీకు నాకు
యేసూటివచ్చునో నీకు యేలయింత గర్వము

చ.3:
కూడిన కొత్తరికపు గుణము చూచేఁగాక
చేడెరో నీ పాటి పొందు చెల్లదా నాకు
యీడనే శ్రీ వెంకటేశుఁడెనసె నిన్నును నన్ను
యేడకేడ మాఁటలాడేవేల యింత గర్వము