పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0177-3 వరాళి సంపుటం: 07-455

పల్లవి:
కానీవయ్యా దానికేమి కలది గలట్టయ్యీ
ఆనుక నీకింకనెంత ఆసోదమో

చ.1:
పాలఁతి నయమంటేను పూఁటలు నన్నడిగేవు
తెలిపిన రతియప్పు తిద్దఁగలనా
యెలమి నాకె వలపు యెరవు నాపైఁ బెట్టేవు
చెలులకింకానెంతేసి సీగ్గువాట్లో

చ.2:
వాడిక యింతికిఁ గుదువగా నన్నుండు మనేవు
కూడి వావి విడిపించుకొనఁగవసమా
మాడలవలె సతుల మారిపిళ్తాడేవు
తోడనిట్టేయందరిని దొడ్డిఁబెట్టేవో

చ.3:
కొమ్మను గాఁగిటఁ గూడి కొసరు నన్నడిగేవు
కమ్మర నేనూఁ దగులు గావలెనా
దొమ్మిశ్రీ వెంకటేశుఁడ తోడఁబెండ్లాడేవు
మమ్మిద్దరి నిక్కడనే మండెమురాయఁడవై