పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0177-1 మంగళకౌశిక సంపుటం: 07-453

పల్లవి:
ఇంకనెన్ని గాఁగలవో యింతి నీవల్లఁ బనులు
సుంకులు మోచినవెల్లాఁ జూచేము నేము

చ.1:
చెలియరో నీవలపు చెక్కులపై రతికెక్కె
పలుకుఁదేనెలఁ గొంత పాలుగారీని
కులుకుఁ గుచములను కొనలు వెళ్ళఁగఁజొచ్చె
పలుదెరఁగులనింత బయలాయ సిగ్గులు

చ.2:
కామినిరో నీ యాసలు కన్నుల రెప్పలు నిండె
దామెనమోవులఁ బంచదార చిందీ్‌ని
వేమరుఁ దురుము జారి విరులు రాలఁగఁజొచ్చె
ఆమని ఆసలతోనే అగడాయఁ బొందులు

చ.3:
అంగనరో నీకూటమి ఆయములన్నియు ముట్టె
రంగుగా మోవి కళల రసములూరె
అంగవించి శ్రీవేంకటాధిపుఁ గూడితివిట్టే
వెంగలితనాన వెల్లవిరులాయఁ జేఁతలు