పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0176-5 భైరవి సంపుటం: 07-451

పల్లవి:
నీ చిత్తము కొలఁదింతే నేనేమనేను
చేచేతనేమి సేసినాఁ జెల్లు నీకు నన్నియు

చ.1:
దొసిట వెన్నెల వట్టి తొడికి చూపవచ్చునా
ఆసల నీకోరికింతంతనవచ్చునా
లాసి నాతోఁ బెనఁగేవు దోసమో అందుకేమి
సేసవెట్టినప్పుడే చెల్లు నీకు నన్నియు

చ.2:
తగిలి యాకసమిట్టే తాసునఁ దూఁచవచ్చునా
జిగి నీమాఁటలకర్దాలు చెప్పవచ్చునా
నగుతా నేమడిగేవు నాకు నీతో బలిమా
చిగురుఁజేఁతలిప్పుడు చెల్లు నీకు నన్నియు

చ.3:
కోవిలకూఁతలొక్కట గుంపు సేయవచ్చునా
ఆవటించి నీవేడుకలాఁపవచ్చునా
కావించి కూడితివి చేఁగల మఱిచెన్నుఁడవై
శ్రీవెంకటేశుఁడ యింకఁ జెల్లు నీకు నన్నియు