పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0176-4 మాళవి సంపుటం: 07-450

పల్లవి:
కామినిసింగారాల కాలమువేళలెరిఁగి
భూమిలోన నిన్నిటాను భోగించవయ్యా

చ.1:
నిలుపుఁదురుముఁ జారి నిండా జీఁకటివడె
సాలపు మోవి కెంపులఁ జుక్కలు నిండె
మొలచిన కళల మోమునఁ జంద్రుఁడుదయించె
వెలలేని నగవుల వెన్నెలగానె

చ.2:
అదనఁ గనుఁగొనల నరుణోదయంబాయ
యదలోని సంతోషాన నిదె వేఁగెను
పొదలు రతికాఁకను పాద్దులువాడచి వచ్చె
ఇదివొ తమకమున నీరెండలూఁ గాసెను

చ.3:
చెక్కుల చిరు చెమట చిక్కని మంచు గురిసె
చక్కఁగా పులకల వసం తము వచ్చె
యిక్కువ శ్రీవెంకటేశ యింతినిట్టె కూడితివి
యెక్కువాయ దినముల యేండ్లకొలఁదుల