పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0176-2 శంకరాభరణం సంపుటం: 07-448

పల్లవి:
లేవే యెక్కడసుద్ది లెస్సాయను
యీవేళ విడెమియ్యవే యీతనికిని

చ.1:
జవ్వన పాయపు సతి చలము సాదించితేను
యెవ్వరు బుద్ధులు సెప్పేరింక మరి
నవ్వుతా విభుండంటితే నాటెనింతే కొనగోరు
పవ్వళించి యిందుకుఁగాఁ బలుకకుండుదురా

చ.2:
ఆఁటది మంకువట్టి అట్టె మాఁటాడకుంటే
వాఁటానఁజెప్ప నొరుల వశమౌనా
చాటువఁబట్టి తీసితే జారెనింతే నీతురుము
తేటలుగా నింతలోనే తెరవేసుకొందురా

చ.3:
దేవులు శ్రీ వెంకటేశుఁ దెలిసి వురమెక్కితే
కావరించి నేము వంకలు దిద్దేమా
భావించి నిన్నుఁగూడితే పచ్చాయనింతె మోవి
మూవంక సిగ్గునఁ గరముల మూసుకొందురా