పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0108-2 ఆహిరి సంపుటం; 07-044

పల్లవి:
సిగ్గువడఁ బోతేను చింతలెక్కీని
వెగ్గళించితే వెన్నెల వేఁడులయ్యిని


చ.1:
చెలువవు నీమోము చెక్కిటనేల మోపేవే
వలపు వెసురు (?) దాఁకి వాడఁబారీని
నిలువునఁ దలవంచి నేలలేల వ్రాసేవే
చలివాసి మదనుఁడు చదివించీని

చ.2:
మూలనున్న నిట్టూర్సు ముంగిటనేల వేసీవే
గాలిగొట్టే యధరము గరివడీని
జాలిఁబడ్డ చెమటల సరితెప్ప లేలెక్కేవే
వేళతోనేా చల్లగాలి వేఁటలాడీని

చ.3:
నంటు మీఱి నెలవుల నవ్వులేల వుమిసేవే
గెంటు లేని కన్నులను కెంపులెక్కీని
యింటిలోనే శ్రీ వేంకటేశుఁడఁ గూడితి నేను
పంటలై పులకపైరు పాలలెక్కీని