పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0175-5 వరాళి సంపుటం: 07-445

పల్లవి:
వరుసతో సాసముఖా వసంత పూర్ణిమ నేఁడు
సిరుల యీ విభవాలు సేవించరో

చ.1:
లలితపు గోవిందుఁడు లక్ష్మీమండపమందున్న
వలరాజదివో కొలువఁగ వచ్చెను
వెలిఁ జంద్రుఁడు తోడనే వెల్లగొడగటు వట్టి
సులభానఁ బవనుఁడు సురటి విసరెను

చ.2:
పాందుగా వసంతుఁడు పువ్వులఁ బూజించవచ్చె
కందువతోఁ దుమ్మిదలు గానముసేసె
సందడించి చిలుకలు చదువఁజొచ్చె పద్యాలు
గొందినే కట్టిగ వారై కోవిలలుగ్గడించె

చ.3:
రతిదేవి మొదలైన రమణులు నాట్యమాడి
రతివసంతమాడె మేఘావళి యెల్ల
తతి శ్రీ వెంకటగిరిఁ దావుకొని యిందునందూ
మితిమీరఁగా మొక్కేరు మెరసి దేవతలు