పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0175-3 శ్రీరాగం సంపుటం; 07-443

పల్లవి:
మీరిని నీతురుము తుమ్మిదమూకలా
కారుకమ్మే కామాంధకారముగాక

చ.1:
అలివేణి నీమోము అద్దమా మోవితేనె
చెలరేగే అమృతపుఁజెలమ గాక
తలఁప నీచేతులేమి తామరతూఁడులా మంచి
వలరాజు మోహనవల్లీ కలుగాక

చ.2:
గరిమ నీ చన్నులు జక్కవలా వలపులు
పెరరేఁచే బంగారు కొప్పెరలు గాక
సిరుల నీనడుమేమి సింహమా నా మనసు
పరువువెట్టే వయ్యాళి బయలుగాక

చ.3:
యెంచఁగ నీపిరుఁదిది యిసుకదిబ్బె యేమి
మించినరతిచుట్టు మేడెముగాక
పొంచి శ్రీవెంకటేశుఁడ ననుఁబొందితివి నీపాదాలు
వందల చిగురు రాజ్య పదములు గాక