పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0175-2 కేదారగౌళ సంపుటం; 07-442

పల్లవి:
చెప్పఁగదే అది చక్కఁజేసేనిపుడు
పిప్పిగట్టు నతనితో బిగిసేటి భావమో

చ.1:
బంతిబోజనానకు పతి గాచుకుండఁగాను
యింతి తోడ నెత్తమాడే వెరఁగనట్టే
ఇంత సేయనేమిటికి యేకతాననేమైనా
కొంత గొంత వొట్టు వెట్టుకొంటివో చలానను

చ.2:
వీడెమియ్య రాఁగాను విభుని క3ెదురురాక
నీడ ముసుఁగిడుకొని నిద్దిరించేవు
జోడువాయఁ బనిలేదు సాగియనివేళను
ఆడ బ్రహ్మచారి వ్రతమట్టి పట్టితివో

చ.3:
శ్రీ వెంకటెశ్వరుఁడు చేరికూడి వుండఁగాను
పావురము పెట్టె మీఁద బత్తిసేసేవు
నీవాతని విడువవు నీమారు పలుకఁగ
యీవిగానతనిచేత నిప్పించుకొంటివో