పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0174-5 నారాయణి సంపుటం: 07-439

పల్లవి:
వింతవారైతే నిన్ను వెంగెమాడరా
జంతఁ గాఁ గనక నీతో సాదనై వుందాన

చ.1:
మచ్చిక నీతరితీపుమూటలు మరిగికదా
యిచ్చకములాడుకొంటా యిట్లుందాన
వచ్చి వచ్చి నీవలపు వలలకుఁ జిక్కికదా
కుచ్చి నీచేఁతలు మెచ్చుకొంటానుందాన

చ.2:
ననుపైన నీసెలవి నవ్వులాసపడి కాదా
మొనసి సారె సారెకు మొక్కుచుందాన
చొనిపి నీకడగంటిచూపులను జొక్కికదా
పనులు సేయుచు నిన్నుఁ బాయకుందాన

చ.3:
రాపుల నీకాఁగిలిరతులఁ దగిలి కదా
వోపి తములానకు చేయొగ్గుచుందాన
పై పై శ్రీ వెంకటేశ పచ్చిమోవిసోఁకి కదా
తేపలైన రతుల నీదేవినైవుందాన