పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0174-3 నాదరామక్రియ సంపుటం: 07-437

పల్లవి:
చెప్పరాని నీ చేఁతలు
చిప్పలీ మేనఁ జెమటలేడవిరా

చ.1:
కంటిఁగా నీ కతలెల్లాఁ నాఁడె
అంటిఁగా నీవన్నట్టే
ఇంటికి వచ్చేవిప్పుడు నీ
వెంటనే వచ్చీ వెలఁది యెవ్వతెరా

చ.2:
నిలిచెఁగా నీ నేరుపులు అవే
తలఁచేఁగా నేఁదమకమున
పిలిచే వెదుటనే ప్రియుఁడవై నీకు
వలచినటువంటి వనిత యెవ్వతెరా

చ.3:
వొరసెఁగా నీవుదుటుగోరు నే
బెరసీఁగా నీపెనురతిని
ఇరవై శ్రీ వెంకటేశ యేలితివి నన్ను
గరిసించి యడిగె నీకాంత యెవ్వతెరా

07-437