పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0174-2 మాళవిశ్రి సంపుటం: 07-436

పల్లవి:
సిగ్గరికాఁడతఁడు చెప్పఁడున మనతోనేవి
యెగ్గులెంచ నేనతని యీడకుఁ బిలువరే

చ.1:
పాంతనె సాములు సేయఁబోలు మేను చెమరించె
వంతుకు నిద్రించఁబోలు వదలెఁ గొప్పు
సంతమాటలాడఁబోలు చక్కనిమోవి గంటాయ
కాంతుని కుపచారాలు కడుమీరు సేయరే

చ.2:
కమ్మి యీఁదులాడఁబోలు కస్తూరిబొట్టు చెదరె
వుమ్మడి కొండెక్కఁబోలు వూర్చులు రేఁగె
పమ్మి జాజరాడఁబోలు పచ్చడము పసపాయ
సామ్ములతోడి ఆతనిఁజూచి మీరు మెచ్చరే

చ.3:
పువ్వుఁదోఁటనుండఁబోలు పొసఁగ మై వాసనంటె
నవ్వఁబోలు మేలు(ను?) మిన్నక యలసె
రవ్వగా నన్నుఁగూడి రతులను జొక్కించె
ఇవ్వల శ్రీ వెంకటేశు యేతులెల్లాఁ జూడరే