పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0174-11 ముఖారి సంపుటం: 07-435

పల్లవి:
ముప్పిరిగొనెఁగా మేలు ముదితలాల
తిప్పరాని తమి తరితీప్పులతో మించెనే

చ.1:
సాలసి చీఁకటిమాను చుక్కలతో మాటాడగాఁ
వెలి మెరుఁగుఁజంద్రుఁడు వెన్నెల గాసె
బలిమి నీరెండుఁ జూచి పంతమున వేరె తెల్లఁ
గలువలేమిటికి చెంగలువలాయనే

చ.2:
గక్కన నిండుమొయిలు గాలివాన గురియఁగా
చిక్కులువడక తీగె చెంగలించెను
తక్కక వొండొంటితో దప్పిదేరఁ బొరుగున
నెక్కువెట్టి చెరకువిండ్లేకతమేలాడెనే

చ.3:
కావించి నీలపుఁ గొండ కళలు పైఁ జల్లఁగాను
సోవలఁ బైఁడియేరు జోడుగూడెను
శ్రీ వెంకటేశుఁడు ప్రేమ చిలుకనెదఁ బెట్టితే
పావురమట్టె బుజముపై నేలకొనెనే