పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0173-6 బౌళిరామక్రియ సంపుటం: 07-434

పల్లవి:
పలుమారు వలపుల పైరులు విత్తఁగవలె
సాలసి తప్పక యిట్టె చూడవయ్య నీవు

చ.1:
చెలియ తమకములు చెక్కుల చెమటలై
నిలువున జిందీని నీయెదుటను
యోలమి జన్నులసందియేరులై పారీ నిదె
కలసి కౌఁగిట గండి గట్టరాదా నీవు

చ.2:
పడఁతి సరసములు పై పైనె నవ్వులై
బడినె మేనఁ జెడలువారఁజొచ్చెను
యెడయక కళలనే యిదివో పదనులెక్కె
కడగోరి రేక నచ్చుకట్టురాదా నీవు

చ.3:
అట్టి అలమేలుమంగ ఆసలే పోదియై
జట్టగొని పులకలససులొత్తెను
ఇట్టి శ్రీవెంకటేశ నీవనయఁ దపసువండె
నెట్టున వేడుక గాదె నించరాదా నీవు