పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0173-5 భైరవి సంపుటం: 07-433

పల్లవి:
ధరణిపై వెన్నెల యెందరు గాయరు
యిరనై నీతో భోగమెంతలేదు మాకు

చ,1:
చిత్తము వచ్చితేఁ జాలు చెలులనెందరినైనా
కొత్తగాఁగ నీవు దెచ్చుకోవయ్యా
హత్తి పూడిగముసేసి అండనుండి బుద్ధిచెప్పి
యిత్తల నానందించ నెంతలేదు మాకు

చ.2:
ఇచ్చ నీకైతేఁజాలు యెందరిసామ్ములైనాను
కుచ్చులుగా మేన మోచుకొనవయ్యా
పచ్చిగా నీపాదాలొత్తి పనులెల్లఁ జేసి చేసి
యెచ్చరి చొక్కుచునుండే నెంత లేదుమాకు

చ.3:
వేడుక నీకైతేఁజాలు వేవేలు సతులను
కూడపెట్టి పెండ్లాడుకొనవయ్యా
నీడల శ్రీవెంకటేశ నిన్నుఁ గూడి కూడి
యీడుజోడుగాఁబెనఁగ నెంతలేదు మాకు