పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0173-4 కాంబోధి సంపుటం: 07-432

పల్లవి:
ఎందరికి వలతువో యెవ్వఁడెరుంగు
కందువ నీ చేఁతలిక్కడ నేనెరఁగనా

చ.1:
కట్టిన వన్నెదట్టి వైదండిచ్చినాపెది
కట్టుకొన్న కంటసరి కాళాంజాపెది
పెట్టుకొన్న పదకము పెద్దఅడపమాపెది
నెట్టున నీ సింగారాలు నెనెరఁగనా

చ.2:
కొనవేలి వుంగరము కుంచె వేసేయాపెది
కొనబు వొడ్డాణము గొడగాపెది
అనువైన పువ్వుదండ అవసరమాపెది
నినుపు నీసింగారాలు నేనెరఁగనా

చ.3:
ముడిచిన సవరము మురిపెపుగిండాపెది
జడినే నీపెఁడెముపావడాపెది
పాడవై శ్రీ వెంకటేశ పుక్కిటివీడెము నాది
నిడివి నీ సింగారాలు నేనెరఁగనా