పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0173-3 ఆహిరి సంపుటం; 07-431

పల్లవి:
ఇల్లురికి వత్తురా యెవ్వరైన సవతులు
మెల్లమెల్లన నీవు మేకులేల సేసేవే

చ.1:
వలపు పదను చూచి వడ్డించితి నేఁబతికి
కలయనేల పెట్టేవే కాంత నీవును
తొలుత నెసరువెట్టి తొయ్యలుల నేనంపితి
పిలువని పేరటము ప్రియమేల చల్లేవే

చ.2:
నవ్వులు దొంతివెట్టితి నడుమంత్రమున నీవు
కువ్వగానేల చూపేవే కూరాకుమోవి
పవ్వళించి యింటిలోన పళ్ళెము నేనె పెట్టితి
మువ్వంక అప్పటి నీవు ముగ్గులేల పెట్టేవే

చ.3:
శ్రీ వెంకటేశు గూడితి చెప్పరాని విందువెట్టి
వావితో విడేలేల వచ్చియిచ్చేవే
చేవదేర గురుతులు చెక్కుల నేనే వొత్తితి
నీవొళ్ళఁ గలిగిన నేర్చులేమి చూపేవే