పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0173-1 శంకరాభరణం సంపుటం: 07-429

పల్లవి:
ఆఁటదాన నేను నీ వధికుఁడవు
వాటముగా మాయింటికి వచ్చినట్టే రార

చ.1:
కూరిమి గలిగితేను కొట్టినాఁ గోపము లేదు
బీరము గలిగితేను భీతి లేదు
వోరుపు గలిగితేను వుల్లములో వెత లేదు
తైగ్రనీ వుద్దండాలు సేసినట్టు సేయరా

చ.2:
తెలివి గలిగితేను తీరని మరుఁగు లేదు
బలిమి గలిగితే తడఁబాటు లేదు
చెలిమి గలిగితేను సిగ్గునెగ్గును లేదు
చెలఁగి నీవుద్దండాలు సెసినట్టు సేయరా

చ.3:
ఆస గలిగితే అడ్డాఁకెందును లేదు
బాసనిజము గలిగితే దోసము లేదు
వాసితో శ్రీవేంకటేశ వడి నన్నుఁ గూడితివి
సేసవెట్టి వుద్దందాలు సేసినట్టు సేయరా