పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0172-6 శోకవరాళి సంపుటం: 07-428

పల్లవి:
ఆఁడువారమైతేనే అంత సిగ్గు విడిచేమా
పేఁడుక పానుపుపైకి పిలిచేవు నీవు

చ.1:
ఏకాంతమునను మీరిద్దరూ నుండఁగాను
కాకుసేసి నేను దగ్గరవచ్చునా
మేకొని మీలోపల మీరే నవ్వుకోఁగా
యీకడ నే నెడచొచ్చి యొలయించవచ్చునా

చ.2:
మచ్చిక నాకరొకరుమాఁటలాఁడుకొనగాను
వచ్చి నేఁ బొత్తు గలయవచ్చునా నేఁడు
పచ్చియైన వలపులను పరవశమై యుండఁగ
పచ్చడము గప్పి మిముఁ బలికించవచ్చునా

చ.3:
నీవు నాపె గూడి నేరుపులు మెరయఁగాను
చేవదేర నేను సేవ సేయవచ్చునా
శ్రీ వెంకటేశ్వర నన్నుఁ జెందితివాకెకుఁ జెప్పి
మా వంటి వారికి మేలు మరవఁగవచ్చునా