పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0172-5 కన్నడగౌళ సంపుటం; 07-427

పల్లవి:
చెప్పినట్టు సేసేఁ గా నీ చిత్తము రాను
అప్పసముగా నాపె అప్పణదేరాదా

చ.1:
అక్క వూడిగెపుదాన నంటానే చెనకేవు
గుక్కక ఆపె గంటేఁ గోపగించదా
తొక్కి నీవు మాఁటఁబడి దూరు నాపై వేయకు
అక్కర అంత గలితే అప్పణదేరాదా

చ.2:
అమ్మపేరిటిదాన నంటానే నవ్వేవు
నెమ్మది నాపె వింటేను నిన్నుఁ దిట్టుదా
నెమ్మి నీవు చేఁతఁబడి నేరము నాపై వేయక
అమ్మరో యిఁనైనాను అప్పణదేరాదా

చ.3:
అలమేలుమంగకొత్తనంటా సొమ్ములిచ్చేవు
చలమున నిందుకాసె సాదించదా
యెలమి శ్రీవెంకటేశ యిద్దరిని నేలితివి
అలవాటుగా నాపె అప్పణదేరాదా