పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0172-3 మధ్యమావతి సంపుటం: 07-425

పల్లవి:
పడఁతికిని నాయకుఁడ బలుతొడవు లిచ్చితివి
యడనెడలఁ జూచినను ఇన్నియునుఁ దొడవు

చ.1:
జలజాక్షి మేనికిని జవ్వనంబిది దొడవు
పాలుపు గన్నులకు చూపులు దొడవు
నెలకొన్న శిరసునకు నిలువుఁ దురుమే తొడవు
కలికి యీ చెక్కులకు కళలు దొడవు

చ.2:
ఘన కుచంబులకు నీ గట్టితనమే తొడవు
వొనరు నడిమికి నాభి వొప్పుఁ దొడవు
అనువైన పిరుఁదులకు నందలి బటువు దొడవు
పెనుఁదొడల కచటఁ బంబిన మెరుఁగు దొడవు

చ.3:
చిగురుఁబాదంబులకు చెంగావియే తొడవు
తగు రూపునకు మంచితనము దొడవు
జిగి నీపైఁ గూడితివి శ్రీవెంకటేశ్వరుఁడ
నగవులకు మిగులనానందములు దొడవు