పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0172-2 కాంబోధి సంపుటం: 07-424

పల్లవి:
నావొళ్ళ దోసములేదు నాఁటి నీపుణ్యములింతే
పూవులు నాకొప్పులలోవి పొంది నీపై రాలెను

చ.1:
యెవ్వతె తిట్టు దాఁకెనో యిదె నీకు నాతమ్మ
పవ్వలించి వుండగానె పైఁబడెను
యివ్వల నప్పటి మరి నెవ్వతె దీవించెనో
దవ్వుల నీవుంటే నాపాదము దాఁకెను

చ.2:
ఉమ్మడి నెవ్వతె గోరుకుండెనో నీవెంట్రుకలు
కెమ్ములనే నాపిడికిటఁ జిక్కెను
పమ్మిన యెవ్వతె తప: ఫలమో నా మెట్టెలతో
కమ్మి నీ కంఠహారాలు కట్టువడెను

చ.3:
వారించి యెవ్వతె యేదేవరకు మొక్కెనో నా
గోరు దాఁకి నీమేను జీరలాయను
యీరీతి శ్రీవెంకటేశ యేలితివి నన్నునిట్టె
చేరెవ్వతెమంత్రాననో చెంది నా కిందైతివి